అసెంబ్లీ: పంటల బీమాపై రభస, వాయిదా

రోశయ్య సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బీమా పథకం లేనే లేదని వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చేసిన ప్రకటనపై తెలుగుదేశం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పయ్యావుల కేశవ్ విమర్శించారు.సభ సద్దుమణగక పోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. రెండు రోజుల పాటు తెలంగాణ అంశంపై అట్టుడికిన శాసనసభ గురువారం నాడు సజావుగా మొదలైంది.












Click it and Unblock the Notifications