సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలి: పయ్యావుల

సమైక్య నినాదానికి మద్దతుగా రాజీనామా చేయని కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యుల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన చెప్పారు. మంత్రులు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పరామర్శించాడనికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావుకు సబితా ఇంద్రారెడ్డి అనుమతి ఇచ్చారని, ఎస్కేయూ విద్యార్థులను తమ శాసనసభ్యుడు రామకృష్ణ వెళ్తే అరెస్టు చేశారని ఆయన అన్నారు. ఉద్యమాల సందర్బంగా సబితా ఇంద్రారెడ్డి వేర్వేరు పద్ధతులు అనుసరించడం సరి కాదని ఆయన అన్నారు. సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రానికంతా హోం మంత్రి అనే విషయాన్ని మర్చిపోవద్దని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications