హైదరాబాద్: మహిళా దినోత్సవం నాడు మహిళా విద్యార్థులపై సోమవారం ముఖ్యమంత్రి నివాసం వద్ద అవమానం జరిగింది. ముఖ్యమంత్రి కె రోశయ్య నివాసం వద్ద ధర్నాకు దిగిన విద్యార్థినులపై పోలీసులు పారిశుధ్యం పనివారిని ప్రయోగించారు. విద్యార్థినులను అరెస్టు చేశారు. ఫీజుల రీయంబర్స్ మెంటు కోసం విద్యార్థినులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసం వద్ద ధర్నాకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
కాగా, అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) విద్యార్థులు కూడా ఫీజుల రీయంబర్స్ మెంటు కోసం ముఖ్యమంత్రి నివాసం వద్ద ధర్నాకు దిగారు.