అసెంబ్లీ గొడవల్లో మీడియా పాత్ర: స్పీకర్

Kiran Kumar Reddy
గుంటూరు: శాసనసభ గొడవల్లో మీడియా పాత్ర కూడా ఉందని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభ సమావేశాలు సజావుగా సాగేందుకు మీడియా సహకరించాలని ఆయన కోరారు. సభలో జరుగుతున్న గొడవలను మీడియా పదే పదే ప్రసారం చేయడం మంచి పద్ధతి కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ విషయంలో మీడియా విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజా సమస్యలకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయన అన్నారు. తాను కొత్త శాసనసభ్యులకు అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన సభ్యులు సభలో ప్రశ్నలు వేయడానికి ముందు నిబంధనలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. వారిని అన్ని పార్టీలూ ప్రోత్సహించాలని ఆయన అన్నారు. తెలంగాణకు మద్దతుగా ఒక శాసనసభ్యుడి రాజీనామా పెండింగ్ లో ఉందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+