రోశయ్య సర్కారుకు బాబు సవాల్

Chandrababu Naidu
హైదరాబాద్‌: జాతీయ ఉపాది హామీ పథకంలో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ పథకంలో అక్రమాలు నిరూపించకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సర్కార్‌కు సవాల్‌ విసిరారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు సభ జరిగిన తీరు, స్పీకర్‌ ప్రవర్తన చాలా బాధాకరమన్నారు. స్పీకర్‌వి చిన్నపిల్లల చేష్టలని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఉపాధిహామీ పనుల్లో అక్రమాలపై చర్చకు అనుమతించకుండా సభను వాయిదావేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఉపాధిహామీ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘించి ఈ పనులను దళారీలకు అప్పజెప్పారని, యంత్రాలతో పనులు చేయించారని ఆయన ఆరోపించారు. ఈ పనుల్లో 4వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+