అనంతపురం: ఆర్టీసీ బస్సు బోల్తాపడి ఇద్దరు మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. హిందూపురం సమీపంలోని మల్‌రెడ్డిపల్లి వద్ద బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా, బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి.
పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల నుంచి సమాచారం సేకరించి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మానసిక స్ధితిని అంచనా వేస్తారు. బైక్ చోదకుల తప్పు ఉందేమో తెలుసుకుంటారు.