జగన్ సందేహాలకు జవాబులున్నాయి: త్యాగి

YS Jagan
న్యూఢిల్లీ: దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై అన్ని కోణాల్లో క్షుణ్నంగా దర్యాప్తు జరిపిన తర్వాతే నివేదిక ఇచ్చామని పవన్‌ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ అధ్యక్షుడు ఆర్‌ కే త్యాగి స్పష్టం చేశారు. తమ నివేదికలో తప్పులేమీ లేవన్నారు. కమిటీలో తనతోపాటు వేర్వేరు రంగాలకు చెందిన నలుగురు నిపుణులున్నారని, అంతా సంతృప్తి చెందిన తర్వాతే నివేదిక అందించామని చెప్పారు. వైయస్ తనయుడు జగన్ లేవనెత్తిన సందేహాలకు నివేదికలోనే సమాధానాలున్నాయని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ పలు సందేహాలను లేవనెత్తిన విషయం తమ దృష్టికి వచ్చిందని, తమకు అప్పగించిన పనిని సక్రమంగానే నిర్వహించినట్లు భావిస్తున్నామని, దేశంలోనే మొట్టమొదటిసారిగా నివేదికను ఆమోదించిన అరగంటకే వెబ్‌సైట్‌లో ఉంచారని అన్నారు.

ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితులపై తమ పరిధికి లోబడి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపామని, ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందా? లేదా? అనే దానిపై డీజీసీఏ దర్యాప్తులో నే చెప్పాలని అన్నా రు. కాక్‌పిట్ వాయి స్ రికార్డులో ఉన్న సంభాషణలను కూ డా పరిశీలించామని, అందులో ఏముందో మాత్రం చెప్పలేనని త్యాగి అన్నారు. తమ నివేదికలో ఇంకా ఏమైనా చేర్చాలనుకుంటే డీజీసీఏ చూసుకుంటుందని అన్నారు. తిరుమలకు హెలికాప్టర్ సర్వీసులను నడిపే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని త్యాగి చెప్పారు. తిరుమలపై హెలీప్యాడ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, మరో నెల రోజుల్లో దీనిపై తుది నిర్ణయానికి వస్తామని తెలిపారు. తమ కంపెనీ సేవలను విస్తరించడానికి ఆసుపత్రులు, బీమా కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+