అల్లర్లపై వదంతులు నమ్మొద్దు: సబిత

Sabitha Indra Reddy
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ అల్లర్ల విషయంలో వదంతులు నమ్మవద్దని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాతబస్తీలో పరిస్థితి అదుపులో ఉందని, సోమవారం తెల్లవారు జామున ఒంటి గంట నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన సంఘటనలు జరగలేదని ఆమె చెప్పారు. హైదరాబాద్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశమైన తర్వాత ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రశాంతతకు భంగం కల్పించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఇప్పటి వరకు అల్లర్లకు సంబంధించి 86 మందిని అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు.

144 సెక్షన్ అమలులో ఉన్న చోట్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పోలీసు బలగాలతో పాటు పారా మిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దింపినట్లు అమె తెలిపారు. అల్లర్లకు సంబంధించిన దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. రేపు జరిగే హనుమాన్ జయంతి ర్యాలీకి అందరూ సహకరించాలని ఆమె కోరారు. పాతబస్తీలో కరెంట్, మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆమె మునిసిపల్ అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+