హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి చాముండేశ్వరీనాథ్ ఆదివారం టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఇంటికి చేరుకున్నారు. సానియాకు కాబోయే భర్త షోయబ్ మాలిక్, అతడు ముందుగా పెళ్లాడినట్టు చెబుతున్న అయేషా సిద్దిఖీకి మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించే బాధ్యతను ఆయన తలకెత్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తను అంతకుముందు చాముండేశ్వరీనాథ్ కొట్టిపారేశారు.
అయితే ఆయన ఎంత కొట్టిపారేసినా శనివారమే ఆయన సానియా తండ్రితో ఒక కారులో ప్రయాణిస్తూ మీడియాకు దొరికిపోయారు. అసలే వివాదాస్పదుడైన చాముండేశ్వరి నాధ్ ఇక్కడ కూడా లెగ్ పెట్టడంతో ముందు ముందు ఏమవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.