ఎస్ ఐ ని తిప్పలు పెట్టి తప్పించుకున్న రౌడీ

ఈసంఘటన బుధవారం రాత్రి అనంతపురం నగరంలోని రాజా, రమణ థియేటర్ల కూడళిలో చోటు చేసుకుంది. కొన్ని వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మున్నానగర్ కు చెందిన రౌడీషీటర్ రమేష్, అతని అనుచరులు రాజా, రమణ థియేటర్ల కూడళిలో ఉన్నట్లు వన్ టౌన్ పోలీసులకు సమా చారం అందింది. ఎస్ ఐ రమణ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈసందర్భంలో రమేష్ ఎస్ఐపై తిర గబడ్డాడు.
ఏం చేశానని అరెస్ట్ చేసేందుకు వచ్చారు? అంటూ తీవ్రస్థాయిలో ఎస్ ఐపై వాగ్వాదానికి దిగాడు. ఇలా దాదాపు పదిహేను నిమిషాల పాటు వారి మధ్య మాటలయుద్దం జరిగింది. తీవ్రత ఎక్కువవుతుండటంతో ఇది పసిగట్టిన ఆరౌడీషీటర్ తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి లగెత్తాడు. ఈహఠాత్పరిణామం నుంచి తేరుకున్న ఎస్ ఐ ఆరౌడీషీటర్ ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
దీంతో చేసేదే మీలేక రౌడీషీటర్ తోపాటు అతని అనుచరులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఈపరిణా మాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications