తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి

ఉదయం 7.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి నేరుగా పుత్తూరు వెళ్లారు. అక్కడ భానోదయ విద్యా సంస్థలను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. 10.45 గంటలకు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమ య్యారు. 11.40 గంటలకు బోత్ ఆస్పత్రిలో నూతనం గా ఏర్పాటుచేసిన ఐసీయూ న్యూరో సర్జరీ కేంద్రాన్ని మాజీ మంత్రి చెంగారెడ్డితో కలసి ప్రారంభించారు.
2.50 గంటలకు ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన జిల్లాస్థాయి నూతన కార్యవర్గ సమావేశంలో సభ్యులను పరిచయం చేసుకుని.. ప్రసంగించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు పాకాల మండలం దామలచెరువుకు చేరుకున్నారు. మామిడిరైతుల కష్టసుఖాలు తెలుసుకున్నా రు. అక్కడ్నుంచి గాదంకి, నేండ్రగుంట వద్ద ఉన్న మామిడితోపుల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. రాత్రి 8 గంటలకు తిరుచానూరులోని పద్మావతి ఫార్మసీ కళాశాలలో ఏర్పాటుచేసిన వార్షికోత్సవంలో విద్యార్థులనుద్దేశించి ప్రసం గించారు.అక్కడినుంచి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications