రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Mahaboob Nagar
మహబూబ్ ‌నగర్‌: మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలం నందిగామ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎదురెదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌, లారీ ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఒక వ్యక్తి షాద్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో నలుగురు మహబూబ్ నగర్ జిల్లా అయిజ మండలం వంకాపురం గ్రామానికి చెందిన రైతులు. మరో ఇద్దరు నల్లగొండకు చెందినవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+