హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తలపెట్టింది రాజకీయ యాత్ర అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం చిరంజీవి బస్సు యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. మూడు జిల్లాల్లో పార్టీని కాపాడుకోవడానికి చిరంజీవి పోలవరంపై బస్సు యాత్ర చేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
చిరంజీవికి పోలవరం తప్ప ఇతర ప్రాంతాల ప్రాజెక్టులు పట్టవా అని ఆయన అడిగారు. చిరంజీవి కాంగ్రెసులో చేరుతారని వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు.