చిత్తూరు: వాతావరణ శాఖకే అంతుపట్టని విషయమిది. చిత్తూరు జిల్లాలోని గంగనపల్లి వద్ద భూమినుంచి వేడిపొగలు రావడంతో గ్రామప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాలిబుడగలతో కూడిన పొగలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రాంతంలో భూమి నల్లగా మారిపోయింది.
రసాయనాల ప్రభావమా లేక భూమినుంచి సహజసిద్దంగా వస్తున్నాయా అన్న విషయం తెలియలేదు. అగ్నిమాపకదళసిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని పొగలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.