కెవిపి రాయబారాలపై దేవినేని నిప్పులు

రెండు వేర్వేరు వ్యవహారాల్లో సునందా పుష్కర్, నీరా రాడియాల జోక్యంపై మీడియాలో వచ్చిన కథనాలను బట్టి కేంద్ర ప్రభుత్వ విధానాల్లో దళారుల పాత్ర రుజువైందని శనివారం ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడిన ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఆరేళ్ల కాంగ్రెసు పార్టీ పాలన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోను, ప్రస్తుత ముఖ్యమంత్రి కె రోశయ్య హయాంలోను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు నిర్దేశకాల మేరకే జరుగుతున్నదని అన్నారు.
రామచంద్రరావు సూచనల కింద రాష్ట్ర ప్రభుత్వం భారీఎత్తున అవినీతిలో కూరుకుపోయిందన్నారు. రాజా, శశిథరూర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చెయ్యాలన్నారు. హైకోర్ట్ ప్రస్తుత న్యాయమూర్తితో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని ఉమామహేశ్వరరావు కోరారు.
స్పెక్ట్రమ్ కేటాయింపులో అవినీతికి సంబంధించి పలు ఆరోపణలను మీడియాలో ప్రస్తావిస్తున్నప్పటికీ యుపిఎ ఛైర్‌పర్శన్ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనంగా ఉండటంపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కుప్పకూలకుండా కాపాడుకునేందుకే కాంగ్రెసు పార్టీ మౌనంగా ఉందని ఆయన అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications