నల్గొండ: నల్గొండ జిల్లా ఆత్మకూర్(ఎన్) మండలం రామన్నగూడెం మాజీ సర్పంచ్ పొరెడ్డి రాంరెడ్డిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. వేసవి కావడంతో ఇంటి ఆవరణలో బయట నిద్రిస్తున్న ఆయనను కొందరు దుండగులు గొడ్డలితో నరికి పారిపోయారు.
ముందుస్తు పథకం ప్రకారమే ఆయన్ను హత్య చేసినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. పొరెడ్డి రాంరెడ్డి పటేల్ గా చుట్టుపక్కల అనేక గ్రామాలకు సుపరిచితుడు.