తిరుపతి: వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. దీంతో తిరుమల భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. 31 కంపార్టమెంట్లలో భక్తులు నిండిపోయి ఉన్నారు. దర్శనం కోసం దాదాపు మూడు కిలోమీటర్ల భక్తులు బారులు తీరారు. సర్వ దర్శనానికి 15గంటలు, శిఘ్ర దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.
వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల రాక పెరిగింది. అయితే తగిన వసతులు లేక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంకన్న దర్శనం కోసం పాట్లు పడుతున్నారు.