అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దంపతులు శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన బస్సు యాత్ర అన్నవరం, ఎవినగరం, పెరుమాళ్లపురం, తొండంగి, తునిల మీదుగా సాగుతుంది.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను డిమాండ్ చేస్తూ ఆయన గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. పోలవరంపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు చేశారు.