వైయస్ జగన్ ను ప్రశ్నిస్తాం: బొత్స

 Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షి దినపత్రికలో వస్తున్న వార్తాకథనాలపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను తమ కాంగ్రెసు పార్టీ వేదికలపై ప్రశ్నిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాఖాపరమైన వైఫల్యాలకు మంత్రులదే బాధ్యతని తేల్చిచెప్పారు. ప్రతి చిన్న అంశానికీ ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. మంత్రివర్గ సమావేశంలో జరిగిన చర్చను బహిర్గతపర్చలేమని ఆయన పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం గురించి పత్రికల్లో వచ్చిన కథనాలు వాస్తవం కాదని అన్నారు. మంత్రివర్గంలో సమష్టితత్వం ఉందని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలు సక్రమంగానే అమలవుతు న్నాయని, ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. పాలనా వ్యవహారాల్లో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు జోక్యం అధికంగా ఉంటోందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మండిపడ్డారు. పాలనా వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే తప్ప ముందుకు నడవలేని స్థితిలో రోశయ్య లేరన్నారు. 'ముఖ్యమంత్రి చిన్న పిల్లాడేమీ కాదు. ఆయన ఈరోజే అధికారాన్ని చేపట్టలేదు. కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. ఆర్థిక మంత్రిగా ఆయన ఎంతో అనుభవం ఉన్న నేత. ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా.. మంత్రుల కమిటీవేసి అధ్యయనం చేయాలంటే చైర్మన్‌గా రోశయ్య పేరే వినిపిస్తుంది. అంతటి అనుభవం ఆయనది' అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+