ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం: డిఎస్

ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శించే నాయకులకూ ఈ సూత్రమే వర్తిస్తుందన్నారు. ఏ అంశంపైనా బహిరంగంగా మాట్లాడటానికి వీల్లేదని, ఏదైనా ఉంటే అధిష్ఠానం వద్దకెళ్లి స్వేచ్ఛగా సలహాలు, ఫిర్యాదులు చేసుకోవచ్చన్నారు. బుధవారం మొయిలీతో రాజకీయ చర్చలేమీ చేయలేదని చెప్పారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటవుతుందని, దానికింకా 28 వరకు సమయం ఉందని అన్నారు. రాష్ట్రంలో అందర్నీ కలుపుకొని వెళ్లే నాయకుడు కావాలన్న కేకే వ్యాఖ్యలపై స్పందించటానికి నిరాకరించారు. దాని అర్థమేంటో ఆయన్నే అడగాలని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో పోటీచేస్తామంటూ వీరప్ప మొయిలీ వెల్లడించటం తుది నిర్ణయమేనా అని అడగ్గా వీరప్ప మొయిలీ మాటే అధిష్టానం మాట అని ఆయన జవాబిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుపెడితే ఎంపీ పదవులకు రాజీనామాచేసి కాంగ్రెసు వారినే గెలిపిస్తామన్న కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించడానికి డీఎస్ నిరాకరించారు.












Click it and Unblock the Notifications