బాలయ్య మనస్సులో లేదు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: సినీ నటుడు బాలకృష్ణను మీడియా ఇబ్బంది పెడుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా బాలయ్య విషయం ప్రస్తావనకు వచ్చింది. మీడియాకు ఏదో ఒక అంశం కావాలని, ఒకే విషయాన్ని పదే పదే అడుగుతుంటారని ఆయన అన్నారు. మన సమాధానంలో ఎక్కడైనా తేడా వస్తే దానినే హైలెట్ చేస్తుంటారని, బాలకృష్ణ విషయంలోనూ అదే జరుగుతోందని ఆయన అన్నారు. బాలకృష్ణ మనసులో లేని దానిని కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతుంటే వారి సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా సమర్థంగా పోరాడగలుగుతున్నామా? లేదా? అన్నది పార్టీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఇక్కడ కొందరు పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా వారికి కాసేపు క్లాస్ తీసుకొన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని, అనేకచోట్ల మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోందని ఆయన అన్నారు. ఉపాధి హామీ ప«థకం మొక్కుబడిగా అమలు చేస్తున్నారని ఇలాంటి అంశాలపై మనం కదలాలి, కదిలించాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+