బాలయ్యతో ఏమీ కాదు: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో ఏదో జరిగిపోతుందని కాంగ్రెసు పార్టీ నాయకులు కలలు కంటున్నారని, ఏమీ జరగదని, తమ పార్టీ క్రమశిక్షణాయుతమైందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య తనను చూసి జాలి పడాల్సిన అవసరం లేదని, రైతులను జాలిపడి వాళ్ల సమస్యలు పరిష్కరిస్తే సంతోషిస్తానని ఆయన అన్నారు. రైతుల పట్ల ముఖ్యమంత్రి గాలివాటంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు దేనికి పునరంకితమవుతుందో చెప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications