వైయస్ ప్రమాదంలో కుట్ర లేదు: సిబిఐ

YSR Chopper Crash
న్యూఢిల్లీ: నిరుడు సెప్టెంబర్‌ 2న జరిగిన వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రకానీ, వెన్నుపోటుకానీ లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) స్పష్టంచేసింది. అది ప్రమాదం మాత్రమేనని తేల్చిచెప్పింది. వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపై గత ఏడాది సెప్టెంబర్‌ 11న విచారణ మొదలుపెట్టిన సీబీఐ శుక్రవారం తన నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కర్నూలు జిల్లా కలెక్టర్‌లకు సమర్పించింది. ప్రమాదం జరిగిన నాడు ఉన్న ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పైలెట్లు ప్రయాణాన్ని నిలిపేసినా, లేదంటే హెలికాప్టర్‌ను దారి మళ్లించివున్నా ప్రమాదాన్ని తప్పించి ఉండేవారని సీబీఐ అభిప్రాయపడింది. అన్ని అంశాలపై దర్యాప్తుచేసిన తర్వాత మొత్తం 200 పేజీల నివేదికను సీబీఐ డీఐజీ లక్ష్మినారాయణ, ఎస్పీ నాగేశ్వరరావులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి.ప్రసాద్‌కు సమర్పించారు.

ప్రమాదంపై అన్నికోణాల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. చాలామంది సాక్షులను విచారించామని, బెంగుళూరుకు చెందిన నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబరేటరీస్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌, హైదరాబాద్‌-న్యూఢిల్లీ-ఛండీగడ్‌లకు చెందిన సెంట్రల్‌ ఫోరెన్సిక్‌, ఢిల్లీలోని రోటరీ వింగ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌లోని జె.ఎన్‌.టి.యు., నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, జెన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు చెందిన నిపుణులతోపాటు ఇతరుల సాయం కూడా తీసుకున్నామని సీబీఐ వెల్లడించింది.

హెలికాప్టర్‌ నిర్వహణలో నిర్లక్ష్యం కనిపించిందని, దీనికి సంబంధించి హెలికాప్టర్‌ నిర్వహణ ఇంజినీరు లక్ష్మణరావుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సీబీఐ సూచించింది. భవిష్యత్తులో ఇటువంటివి జరుగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలనూ నివేదికలో పొందుపరిచింది. ముఖ్యంగా వీఐపీలు ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన ఈ హెలికాప్టర్‌ ప్రమాదంపై త్యాగీ నేతృత్వంలోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎం.ఆర్‌.రెడ్డి, కోసాలతో కూడిన ద్విసభ్య కమిటీ ఇప్పటికే నివేదికను సమర్పించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+