రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. గోదావరిఖనికి చెందిన భాగ్యలక్ష్మి, ఉష, రాజమణిలు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో జమ్మికుంటకు వెళ్లేందుకు స్టేషన్‌లో పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు.
ఈ సమయంలో కన్యాకుమారికి వెళుతున్న సూపర్ ఫాస్ట్ రైలు వేగంగా వచ్చి ఢీకొనడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందినవారు.