వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్ని-2 క్షిపణి ప్రయోగం సక్సెస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Agni-II
బాలాసోర్: అగ్ని-2 బాలస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒరిస్సా తీరంలోని బాలసోర్ సమీపంలోని వీలర్ దీవుల నుంచి సోమవారం ఉదయం ఈ క్షిపణిని ప్రయోగించారు. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం గల ఈ క్షిపణి భారత సైన్యంలో ప్రధాన భూమిక పోషించనుంది. ఇది 21 మీటర్ల పొడవు ఉంది. 17 టన్నుల బరువు ఉంది. ఇది భారత అంతరిక్ష పరిశోధనలో మరో మైలు రాయి.

అగ్ని-2 క్షిపణి 2 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం గలది. గతంలో ఓ ప్రయోగం విఫలమైంది. ఆ వైఫల్యం ప్రమాణాలకు సంబంధించిన సమస్యనే తప్ప ప్రాథమిక లోపం కాదని అంటున్నారు. పేలోడ్ తగ్గిస్తే మరింత దూరంలోని లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు. హైదరాబాదుకు చెందిన డిఆర్డీవో లాబొరేటరీతో పాటు అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ ఈ క్షిపణిని రూపొందించాయి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇంటిగ్రేట్ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X