దిశ మార్చుకున్న లైలా తుఫాను

సముద్రంలో అలలు మీటరు నుంచి ఐదు మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. తుఫాను క్రమంగా బలహీనపడుతున్నట్లు చెబుతున్నప్పటికీ దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంటున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావం పడే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications