అన్ని పార్టీల్లో మేమే కదలిక తెచ్చాం: చిరంజీవి

Chiranjeevi
న్యూఢిల్లీ: గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుపై తామే కదలిక తెచ్చామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలవడానికి పార్టీ శాసనసభ్యులతో కలిసి ఆయన బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. పోలవరం ఇతర రాజకీయ పార్టీలు మాటలు మాత్రమే చెబుతూ వస్తున్నాయని, తాము చైతన్యం తెచ్చి ఒత్తిడి తేగలిగామని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

పోలవరం ప్రాజెక్టును 2005లో చేపట్టారని, ఇన్నేళ్ల తర్వాత కూడా పది శాతం పనులు పూర్తి కాలేదని, అయినా ఎవరికీ ఆ విషయం పట్టలేదని, తాము ఆందోళన చేపట్టిన తర్వాత కదలిక వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రధాని వద్ద పోలవరం వద్ద సూచనప్రాయంగా చెప్పడానికి కూడా తామే కారణమని ఆయన అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులపై తాము చైతన్యం తెస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+