చిరంజీవికి భ్రమలు తొలిగి, భ్రాంతి మిగిలింది: హరికృష్ణ

ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశ చెంది చిరంజీవి కాంగ్రెసుతో చేతులు కలిపారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు అవినీతిలో భాగస్వామి కాదలుచుకున్నావా అని ఆయన చిరంజీవిని ప్రశ్నించారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్న చిరంజీవి ఏ ప్రజల కోసం కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధపడ్డారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని ఆయన అన్నారు. సామాజిక తెలంగాణ సాధిస్తామని చెప్పి ఆ ప్రాంత ప్రజలను మోసం చేసి సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధపడి సీమాంధ్ర ప్రజల ఆశలను కూడా నీరుగార్చారని ఆయన చిరంజీవిపై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications