ఉప ఎన్నికల్లో తెలంగాణ అంశమే కాదు: జెసి దివాకర్ రెడ్డి
State
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: శాసనసభ ఉప ఎన్నికల్లో తెలంగాణ అంశం ప్రభావం చూపదని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 12 శాసనసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో స్థానిక అంశాలే ఎజెండా అవుతాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
జలయజ్ఞంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని పార్టీ సీనియర్ నేతలు ఆరోపణలు చేయడం సరి కాదని, ఆ ఆరోపణలు నిరాధారమని ఆయన అన్నారు. జలయజ్ఞంలో ఏమైనా లోపాలు ఉంటే సమీక్ష జరపడం మంచిదేనని ఆయన అన్నారు.