ఆటో డ్రైవర్ కుమారుడు మొహ్మద్ గౌస్ ఎంసెట్ టాపర్

నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ తనకు ఉచిత విద్యను అందించారనీ, తాను సాధించిన ర్యాంకు ఆయనకే అంకితం చేస్తున్నానని జానీ చెప్పాడు. జెఎన్‌టియు హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ బ్రాంచీలో కానీ, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇదే బ్రాంచీలో తాను చేరుతానని గౌస్ జానీ చెప్పారు. తన సోదరుడు అంగవికలుడనీ, ఇటీవలే చనిపోయాడని అన్నారు. తనకు ఇంటర్మీడియట్‌లో 965 మార్కులు వచ్చాయనీ, పదవ తరగతిలో 512 మార్కులు వచ్చాయని చెప్పాడు. తన తండ్రి కేవలం పదవ తరగతి వరకు చదివారనీ, తల్లి షహ్‌నాజ్ ఇంటర్మీడియట్ వరకు చదివి ఇంట్లోనే తమకు సేవలందిస్తుంటారని ఆయన అన్నారు. తనకు ఇష్టమైన హిందీ నటుడు హృతిక్ రోషన్ అనీ, తెలుగులో చిరంజీవిని ఎక్కువగా అభిమానిస్తానని జానీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications