హైదరాబాద్: హైదరాబాదులోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యమైన కేసు నమోదైంది. శారద కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న సంతోషి అనే విద్యార్థిని వీసా కోసం బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.