సహనమా, తిరుగుబాటా: తేల్చుకోవాల్సింది వైయస్ జగనే

మొయిలీ స్పష్టంగా చెప్పడంతో ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సిన పరిస్థితిలో జగన్ పడ్డారు. అధిష్టానాన్ని ధిక్కరించడమా, శిరసా వహించడమా అనేది ఇప్పుడు ఆయన నిర్ణయించుకోవాల్సిందే. అధిష్టానం వద్ద తిరిగి పరపతి సాధించడానికి జగన్ దీర్ఘకాలమే ఎదురు చూడాల్సి ఉంటుంది. అది ఎంత కాలమనేది కూడా స్పష్టంగా చెప్పలేని వాతావరణం. అందుకు కొన్నేళ్లు పట్టవచ్చు. అయితే అంత కాలం నిరీక్షించే ఓపిక జగన్ కు ఉందా అనేది సందేహమే. ప్రతిసారీ జగన్ తమను ప్రశ్నించేలా, ధిక్కరించే విధంగా వ్యవహరిస్తూ ఉండడమే అధిష్టానం కఠిన వైఖరికి కారణమని అంటున్నారు. ఒక్కసారి పట్టు విడిస్తే జగన్ రెచ్చిపోయే ప్రమాదం ఉందనే భావనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications