డబ్బు కక్కుర్తితో హైదరాబాదులోని మహేష్ ఆస్పత్రి నిర్వాకం

సత్యనారాయణ అనే వ్యక్తి హెర్నియా ఆపరేషన్ కోసం మహేష్ ఆస్పత్రిలో చేరాడు. అయితే, గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నాయంటూ వైద్యులు అతనికి జీర్ణాశయ శస్త్ర చికిత్స చేశారు. హెర్నియా ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకం రాదు. దాంతో డబ్బులు కొట్టేయడానికి శస్త్రచికిత్సనే మార్చేశారు. ఆస్పత్రి నిర్వాకంపై సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications