వైయస్ జగన్ యాత్రపై రోశయ్య బెదిరింపులు సరి కాదు: అంబటి రాంబాబు

Ambati Rambabu
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని ప్రజాప్రతినిధులకు సూచించిన ముఖ్యమంత్రి కె. రోశయ్యపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని రోశయ్య బెదిరించడం సరి కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ హఠాన్మరణంతో ముఖ్యమంత్రి పీఠం దక్కిందనే విషయాన్ని రోశయ్య గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

వైయస్ సంవత్సరీకం జరగక ముందే రోశయ్య వైభవంగా పుట్టిన రోజు జరుపుకోవడం ఏ రకంగా సమంజసమని ఆయన ప్రశ్నించారు. అధిష్టానవర్గానికి చెప్పి జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇప్పించాలని ఆయన రోశయ్యను కోరారు. జగన్ ఓదార్పు యాత్ర క్రమశిక్షణా రాహిత్యం కాదని ఆయన అన్నారు. లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+