బాబ్లీని ఆపించేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: చంద్రబాబు

బాబ్లీ ప్రాజెక్టును ఆపే వరకు తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. మాటలు చెప్తే సరిపోదని, ప్రాజెక్టును అపించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం సభ్యులు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. బాబ్లీపై తక్షణ చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. దాన్ని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఆ తర్వాత శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications