ఐదేళ్లలో జగన్ రాజకీయ జీవితం ముగిసిపోతుంది: పాల్వాయి

కాంగ్రెసు ఏమైనా ఫరవా లేదు, ఎన్ని గ్రూపులైనా ఫరవా లేదనే పద్ధతిలో జగన్ వ్యవహరిస్తున్నారని, తనకు పార్టీ అధిష్టానం భయపడుతుందనీ తనను ఏమీ చేయదనీ అనుకుంటున్నారని, అలా అనుకుంటే పొరపాటేనని ఆయన అన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే పార్టీ అధిష్టానం సహించదని, ఇంతకు ముందు సహించలేదని ఆయన అన్నారు. ఓదార్పు యాత్రలు ఎప్పుడూ ఉండవని, వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్ని కార్యక్రమాలు చేశాడో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ఈ రోజు వేడి రేపు ఉండదని, ఈ రోజు వేడి చూసుకుని శాసనసభ్యులు, కార్యకర్తలు తన వెంట ఉన్నారని జగన్ అనుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. సైకోఫాన్స్, అసాంఘిక శక్తులు చూపిన దారిలో జగన్ నడుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications