వైయస్ జగన్ యాత్రపై కుండ బద్దలు కొట్టిన రోశయ్య

జగన్ ఓదార్పు యాత్రను ఆపితే మంచిదని ఆయన అన్నారు. అడగకుండా ఆయాచితంగా సలహా ఇచ్చే అలవాటు తనకు లేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రపై మేడమ్ సోనియా గాంధీ తనతో మాట్లాడలేదని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తనతో మాట్లాడారని ఆయన చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర రాష్ట్ర రాజకీయాలపై ఏ విధమైన ప్రభావం చూపదని ఆయన అన్నారు. పార్టీలో ఏ విధమైన అనిశ్చితి నెలకొనబోదని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాలను తారుమారు చేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. జగన్ తన అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పారు. తన అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications