అసెంబ్లీలో చంద్రబాబు, రోశయ్య మధ్య వాగ్వివాదం

మౌలిక సదుపాయాలు సరిగా లేనందున ట్రిపుల్ ఐటిల్లో సీట్లు తగ్గించామని సాంకేతిక విద్యామంత్రి మోపిదేవి వెంకటరమణ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని బిజెపి, సిపిఐ, సిపిఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వారు వాకౌట్ చేసిన తర్వాత కూడా ట్రిపుల్ ఐటిల్లో సీట్ల కోతపై చర్చ జరిగింది. ట్రిపుల్ ఐటిల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని చంద్రబాబు విమర్శించారు. ట్రిపుల్ ఐటిల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. తాము ఎన్నికల కోసం వాగ్గానాలు చేయలేదని, చిత్తశుద్ధితో అమలు చేయడానికి పూనుకున్నామని ఆయన చెప్పారు. ఈ సమయంలో తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం తీరుకు తమ పార్టీ నిరనస వ్యక్తం చేస్తోందని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications