అధిష్టానంతో వైయస్ జగన్ సయోధ్య సాధ్యమయ్యేనా?

అధిష్టానంతో జగన్ కు సయోధ్య కుదర్చడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించే విధంగా లేవు. అటు సయోధ్య ప్రయత్నాలు జరుగుతుండగానే ఇటు హైదరాబాదులో జగన్ ముఖ్య అనుచరుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి రోశయ్యపై, అధిష్టానంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. సురేఖ లేఖతో గానీ అంబటి రాంబాబు విమర్శలతో గానీ తనకు సంబంధం లేదని జగన్ చెప్పే మాటలను విశ్వసించే పరిస్థితిలో అధిష్టానం లేదు. జగన్ కావాలనే ఓ వైపు రాజీ ప్రయత్నాలు సాగిస్తూ మరో వైపు తన అనుచరులతో దాడి చేయిస్తున్నారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. ఈ పరిస్థితిలో జగన్ ను అధిష్టానం మునుపటిలా స్వీకరించడానికి సిద్ధంగా లేదు. పైగా, జగన్ ను ఒంటరి చేయాలనే ఎత్తుగడలను అనుసరిస్తూ వస్తోంది.












Click it and Unblock the Notifications