సీమాంధ్ర మంత్రులపై కాంగ్రెసు తెలంగాణ నేతల ధ్వజం

సీమాంధ్ర నేతల వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా మండిపడ్డారు. సీమాంధ్ర మంత్రులు అంకెల గారడీ చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ అభివృద్ధి చెందిందని సీమాంధ్ర మంత్రులు చేస్తున్న వాదన తప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెనకబడిన జిల్లాల జాబితా నిదర్శనమని ఆయన అన్నారు. ఈ స్థితిలో కలిసి ఉండడం కన్నా విడిపోవడమే మంచిదని ఆయన అన్నారు. సీమాంధ్ర మంత్రుల తీరుపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం కూడా మండిపడ్డారు.
కాగా, సీమాంధ్ర మంత్రుల తీరుపై తెలంగాణలో నిరసన జ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. సీమాంధ్ర మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ లో న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర మంత్రులను తొలగించే వరకు పోరాటం చేస్తామని వారు చెప్పారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు చెలరేగాయి.












Click it and Unblock the Notifications