పురంధేశ్వరి, దగ్గుబాటి దంపతులను దుమ్మెత్తి పోసిన సాక్షి డైలీ

ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలను సొంత డబ్బులతో ఢిల్లీకి తీసుకెళ్లి ఓదార్పులో పాల్గొనరాదంటూ హైకమాండ్ తో చెప్పించడానికి తంటాలు పడ్డ దగ్గుబాటి, పురంధేశ్వరి తాజాగా పార్టీపరంగా యాత్ర చేపట్టాలనడంలో పరమార్థం ఏమిటని సాక్షి డైలీ తన వార్తాకథనంలో ప్రశ్నించింది. ప్రకాశం జిల్లా శాసనసభ్యులను దగ్గుబాటి వెంకటేశ్వర రావు సంత డబ్బులతో ఢిల్లీకి తీసుకెళ్లారని, దానికితోడు నోట్ లో ఏముందో చూపించకుండా శాసనసభ్యుల చేత ఆ నోట్ ను జగన్ కు ఇప్పించారని సాక్షి ఆరోపించింది. జగన్ కు వ్యతిరేకంగా పురంధేశ్వరి, వెంకటేశ్వర రావు కుట్ర చేస్తున్నారని మొత్తంగా సాక్షి వార్తాకథనం సారాంశం. జగన్ ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా తెర వెనక కథ నడిపిస్తూ ఇప్పుడు తెర మీదికి వచ్చారని సాక్షి ఆరోపించింది. ఎల్లో సిండికేట్ తో వారు కుమ్మక్కయ్యారని సాక్షి ఆరోపించింది. ఈనాడు, ఆంధ్రజ్యోతితో కుమ్మక్కయ్యారనేది పాఠకులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications