వాసిరెడ్డి పద్మ ప్లేటు ఫిరాయింపు: చిరు పెద్దన్నయట

తనకు ప్రజారాజ్యం రాజకీయంగా పుట్టినిల్లులాంటిదని, చిరంజీవి నీడ కింద తాను రాజకీయంగా ముందుకు వచ్చానని ఆమె చెప్పుకున్నారు. సమస్యలు, చర్చనీయాంశాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడుకునే విషయాలని తాను భావించానని, వాటిని బజారుకీడ్చాలని గానీ రచ్చ చేయాలని గానీ తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఒకే విషయం మీద లేఖ రాశానని, చిరంజీవి వద్ద ఎంతో ప్రజాస్వామ్యం ఉందని ఆమె అన్నారు. తాను పార్టీ మీదనో, చిరంజీవి మీదనో యుద్ధం ప్రకటించడం లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications