ఉస్మానియాలో సీమాంధ్ర లెక్చరర్లపై దాడి దురదృష్టకరం: బాబు

ఓయూలో అధ్యాపకులపై దాడి అంశంపై తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక శక్తులు పెట్రేగిపోతున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర వాసుల్ని బతకనివ్వరా అని ప్రశ్నించారు. దాడులకు పాల్పడుతున్న విధ్వంసకర శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులు తెలంగాణ ఉద్యమానికి నష్టం కలిగిస్తాయని తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. అమాయకులైన అధ్యాపకులపై ఓయూ విద్యార్థులు దాడి చేయడం సరైన చర్య కాదని ఆయన తిరుపతిలో మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications