నేను ఒంటరిని కాదు...ఆ మాట అనేవారే ఏకాకులు: వైయస్ జగన్

ప్రకాశం జిల్లాలో కొనసాగిస్తున్న ఓదార్పు యాత్రలో భాగంగా వెలిగండ్ల మండలంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇంతమంది తోడుగా ఉంటే నేను ఒంటరిని ఎలా అవుతాను. అసలు నేను ఏకాకినని ఎవరు అన్నారు. ఆ మాటలు అనే వారే తన దృష్టిలో ఒంటరివారన్నారు. కేవలం తమ కుటుంబాన్ని మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా చూసిన మహానేత వైయస్ ఆర్ హఠాన్మరణం తర్వాత ఈ రోజు చిరునవ్వుతో మీ ముందు ఉన్నానంటే అది మీరందరూ చూపుతున్న ప్రేమాభిమానాలేన్నారు. ఆరు నూరైనా తన యాత్రను పూర్తి చేసి తీరుతానని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని జగన్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications