తెలంగాణ పర్యటనపై వెనక్కి తగ్గిన చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu
హైదరాబాద్‌: తన తెలంగాణ పర్యటనకు విరామం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. దాడులకు భయపడి పర్యటనలు మానుకోవాల్సిన అవసరం లేదని, అయితే ఉద్రిక్తతలు పెరగకుండా మధ్య మధ్యలో విరామం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో దాడి ఘటన తర్వాత ఆయన కొంత మంది నాయకులతో చర్చించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటన ముగిసిన వెంటనే వరంగల్ జిల్లాలో పర్యటించాలని ఆయన తొలుత అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచనను మానుకున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలోనే అంతగా వ్యతిరేకత ఎదురైతే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న వరంగల్ జిల్లాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉండవచ్చునని చంద్రబాబు అంచనా వేసుకున్నట్లు చెబుతున్నారు. తగిన సమయాలు చూసుకుని పకడ్బందీగా తెలంగాణ జిల్లాలోకి అడుగు పెట్టాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ఎంతగా చెప్పినప్పటికీ తెలంగాణలో వ్యతిరేకత తప్పడం లేదు. చంద్రబాబు తెలంగాణ పర్యటనలను అడ్డుకుంటామని ఉస్మాియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా అడుగులు వేయడమే మంచిదని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+