డి శ్రీనివాస్ ప్రకటన: వైయస్ జగన్ కు మరో షాక్

ప్రకాశం జిల్లాలో 8 మంది ప్రజాప్రతినిధులు ఓదార్పు యాత్రకు దూరంగా ఉన్నారు. జగన్ వెంట ఆయన బంధువైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మరో ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిలు మాత్ర మే యాత్రలో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో వచ్చిన డి. శ్రీనివాస్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ప్రకాశం జిల్లాలో వీలైనంత ఎక్కువ కాలం గడిపి, తర్వాత పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలో యాత్రను చేపట్టేందుకు జగన్ వర్గం సన్నాహాలు చేస్తోంది. ఓదార్పు యాత్రకు దూరంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి నిర్ణయించుకోవడం జగన్ కు పెద్ద దెబ్బనే. దానికి తోడు, ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పావులు కదుపుతోంది. ఈ స్థితిలో జగన్ వర్గానికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యే పరిస్థితి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications