కిరణ్ కుమార్ ను సిఎంను చేసేందుకు వైయస్ జగన్ డ్రామా?

Kiran Kumar Reddy
హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు వైయస్ జగన్ నాటకం ఆడుతున్నారా? తనకు అనుకూలుడైన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు వైయస్ జగన్ నాటకాలు ఆడుతున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) ఆరోపించింది. ఈనెల 17న ఓయూలో జరిగే తెలంగాణ విద్యార్థి ఆత్మగౌరవ సభ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు పిడమర్తి రవి, రాజారాం యాదవ్‌, ప్రవీణ్‌రెడ్డి, పున్న కైలాష్‌ నేత మాట్లాడారు.

జగన్‌ తన అనుకూలుడైన కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డిని తొలగించి గ్రూపు-1 పరీక్ష తిరిగి నిర్వహిస్తే 20 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారంటూ ముఖ్యమంత్రి రోశయ్యను జగన్‌ వర్గీయులు బెదిరించారని వారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మహబూబ్‌నగర్‌ పర్యటన సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిని వారు ఖండించారు. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు ఆయన తెలంగాణలో తిరగకుండా అడ్డుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+