వైయస్ జగన్ కంపెనీలకు ఇక ఐటి కష్టాలు మొదలు

'రాజా ఆఫ్ కరప్షన్' పేరుతో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తయారు చేసిన 333 పేజీల నివేదిక ఆధారంగా ఈ పరిశీలన చేపట్టినట్లు తెలుస్తోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే 2009 ఫిబ్రవరిలో ఈ నివేదికను రాష్ట్రపతికి, మరికొందరు ముఖ్యులకు ఆయా పార్టీల నేతలు అందజేశారు. చట్టాలను ఉల్లంఘించి వివిధ సంస్థల్లో పెట్టుబడులను పెట్టారంటూ కొన్ని ఆధారాలను కూడా ఇందులో పొందుపర్చారు. షేర్ల ధరలను విపరీతంగా పెంచి కొన్నారనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఈ నివేదిక ఇక్కడి ఆదాయపు పన్ను శాఖ పరిశోధన విభాగానికి చేరింది. ప్రధానంగా సాక్షి పత్రిక, సాక్షి టెలివిజన్, భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టిన దాదాపు పది కంపెనీలకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. పెట్టుబడిగా పెట్టిన సొమ్ముకు పన్నును సక్రమంగా కట్టిందీ లేనిదీ తెలుసుకోవటమే ఈ నోటీసుల ఉద్దేశమని ఐటీ వర్గాలు తెలిపినట్లు ఆ వార్తాకథనం సారాంశం.












Click it and Unblock the Notifications