వైయస్ రాజశేఖర రెడ్డితో చంద్రబాబు నాయుడు మ్యాచ్ ఫిక్సింగ్

సీఎల్పీ నేతగా వైఎస్ ఇడుపులపాయలో 400 ఎకరాలు, రాజంపేటలో 200 ఎకరాలు భూమి కబ్జా చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు భూమి కేటాయింపు చంద్రబాబు హయాంలోనే జరిగిందని, దాన్నే వైఎస్ కొనసాగించారని ఆయన అన్నారు. బయ్యారంలో ఇనుప ఖనిజ లూటీ గురించి ఆ రోజు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ఆయన అడిగారు. వారిద్దరి మధ్యా అవగాహన ఉన్నదన్నారు. నిజానికి వైఎస్ కూడా చంద్రబాబుతో మాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన అవినీతిపై వైఎస్ హైకోర్టులో కేసు వేసి, తర్వాత ఉపసంహరించుకున్న విషయాన్ని విహెచ్ గుర్తు చేశారు. సోనియాకు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుస్తున్నాయని, అన్ని విషయాలను ఆరా తీసి చర్యలు తీసుకుంటున్నారని వీహెచ్ అన్నారు.
చంద్రబాబు కూడా రెండెకరాల నుంచి వేల కోట్లు సంపాదించిన ముఖ్యమంత్రేనని ఆయన అన్నారు. సోనియా ప్రోత్సాహమే లేకుంటే వైఎస్ సీఎం అయ్యేవారు కాదన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కూడా ఈ విషయం గ్రహించాలని ఆయన సూచించారు. వైఎస్ కుమారుడు కాబట్టే ఇంతవరకు జగన్‌కు సోనియా ప్రాధాన్యం ఇచ్చారని, దాన్ని జగన్ గ్రహించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications