రంగారెడ్డి జిల్లాలో తెరాస, టిడిపి పోటాపోటీ ఆందోళనలు

వికారాబాద్, చేవెళ్లలో తెరాస నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్లో నిరసన చేపడుతున్న నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లదాడికి నిరసనగా తెదేపా సైతం స్పందించింది. పరిగిలో ఆ పార్టీ కార్యకర్తలు రహదారిపై ఆందోళన నిర్వహించారు. అనంతరం మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. బంద్ సందర్భంగా వికారాబాద్, పరిగి, చేవెళ్ల లో బస్సులను అధికారులు నిలిపివేశారు. బస్సులు నడువక పోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.












Click it and Unblock the Notifications